గుడుంబా నిర్మూలనపై జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్: ఎస్పి

2చూసినవారు
గుడుంబా నిర్మూలనపై జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్: ఎస్పి
ఆదిలాబాద్ జిల్లాలోని 11 పోలీస్ స్టేషన్ల పరిధిలో గురువారం 35 బృందాలతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్లో 26 మందిపై కేసులు నమోదు చేశారు. 32.5 లీటర్ల గుడుంబా, 35 లీటర్ల బెల్లం వాష్, 705 లీటర్ల కల్తీ కల్లును స్వాధీనం చేసుకున్నారు. గుడుంబా తయారీ, విక్రయాలు, అక్రమ మద్యం రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. ప్రజలు సమాచారం పోలీసులకు తెలియజేయాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్