
జోగి రమేశ్ ఇంట్లో ముగిసిన సోదాలు (వీడియో)
AP: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంట్లో సిట్, ఎక్సైజ్, పోలీస్, క్లూస్ బృందాలు సంయుక్తంగా సోదాలు నిర్వహించాయి. దాదాపు 2 గంటలపాటు కొనసాగిన ఈ సోదాల్లో అధికారులు సీసీ ఫుటేజ్, ల్యాప్‌టాప్‌లు, పలు పత్రాలను పరిశీలించారు. అనంతరం ఆయన తమ్ముడు రాము ఇంట్లో కూడా సోదాలు జరిపారు. ఈ దర్యాప్తులో భాగంగా అధికారులు పలు హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. సోదాలు ముగిసిన తర్వాత అధికారులు వివరాలను రహస్యంగా ఉంచారు.




