గ్రేడ్-2 కార్యదర్శిగా పదోన్నతి పొందిన శ్రీకాంత్ రెడ్డి జైనథ్ మార్కెట్ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం పీఏసీఎస్ ఛైర్మన్ బాలూరి గోవర్ధన్ రెడ్డి, సీఈఓ గంగన్న మార్కెట్ కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డిని శాలువాతో సత్కరించారు. మార్కెట్ కార్యాలయాన్ని సమర్థవంతంగా నిర్వహించి, రైతులకు మరింత మెరుగైన సేవలు అందించాలని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.