దళిత సామాజిక వర్గాల ప్రజల సమస్యల పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజర్షిషా స్పష్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లా షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఎస్సీ సంఘాల ప్రతినిధులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గత నెల 15 న నిర్వహించిన సమావేశంలో ప్రతినిధులు ప్రస్తావించిన వివిధ సమస్యలు, అభ్యర్థనలపై శాఖల వారిగా సమీక్షించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందని, ఇందులో భాగంగానే సమస్యల పరిష్కార పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని స్పష్టం చేశారు.