ఆదిలాబాద్ జిల్లాలో సబ్ రిజిస్టర్ కార్యాలయలో మంగళవారం రిజిస్ట్రేషన్ సేవలు నిలిచిపోయాయి. సర్వర్ ఇష్యూ కారణంగా ఉదయం నుంచి రిజిస్ట్రేషన్‌లు పెండింగ్లో ఉండిపోయాయి. దీంతో కార్యాలయం ప్రజలు లేక నిర్మానుషంగా దర్శనమిచ్చింది. సర్వర్ అప్డేట్ కావడానికి వారం పడుతుందని సబ్ రిజిస్టర్ 2 శ్రీలత తెలిపారు. ఉదయం నుంచి కేవలం ఒక రిజిస్ట్రేషన్ అయిందని ప్రతిరోజు సుమారు 30 వరకు రిజిస్ట్రేషన్లు జరుగేవన్నారు.