వీడీసీలు చట్ట వ్యతిరేక పనులు చేస్తే కఠిన చర్యలు: ఎస్పీ

0చూసినవారు
వీడీసీలు చట్ట వ్యతిరేక పనులు చేస్తే కఠిన చర్యలు: ఎస్పీ
గ్రామాభివృద్ధి కమిటీలు (వీడీసీలు) చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. గ్రామాభివృద్ధి పేరుతో వసూళ్లకు పాల్పడటం, బెల్టు షాపులు, కళ్లు దుకాణాలు, ఇసుక తవ్వకాలకు అనధికారికంగా అనుమతులు ఇవ్వడం వంటివి చేస్తే వీడీసీలపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. వీడీసీల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనేవారు నిర్భయంగా జిల్లా పోలీసులను సంప్రదించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్