సీఎం పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

1చూసినవారు
సీఎం పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 4న ఆదిలాబాద్ జిల్లా పర్యటన నేపథ్యంలో, జిల్లా కలెక్టర్ రాజర్షి షా సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎస్పీ అఖిల్ మహాజన్ తో కలిసి నిర్వహించిన ఈ సమావేశంలో, పర్యటనలో ఎలాంటి లోపాలు లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. స్టేజ్ నిర్మాణం, వైద్య శిబిరం, పారిశుధ్యం, పార్కింగ్, తాగునీరు, విద్యుత్ సరఫరా వంటి ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని, పర్యటన రోజున అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్