ఆదిలాబాద్ పోలీసు హెడ్ క్వార్టర్స్ లో మంగళవారం జరిగిన ప్రత్యేక సమావేశంలో, గత విద్యా సంవత్సరంలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బంది పిల్లలను ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించారు. 85 శాతం పైగా మార్కులు సాధించిన 50 మంది విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు.
విద్యార్థులు చిన్నప్పటి నుండే ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని వాటిని సాధించే దిశగా కృషి చేయాలని ఆయన సూచించారు.