ఆదిలాబాద్‌లోని సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు సోమవారం ఉట్నూరులోని పట్టు పరిశ్రమ కేంద్రం, ఐటీడీఏ ఉద్యాన నర్సరీలను విజ్ఞాన యాత్రలో భాగంగా సందర్శించారు. పట్టు పరిశ్రమ కేంద్రంలో ఐటీడీఏ ఉద్యాన అధికారి సందీప్ కుమార్ మల్బరీ తోటల పెంపకం, పట్టుపురుగుల పెంపకం, రీలింగ్ యూనిట్ గురించి వివరించారు. ఉద్యాన నర్సరీలో వివిధ రకాల పండ్ల తోటల పెంపకం, సాగు విధానాలు, మొక్కల తయారీ, అంట్లు కట్టే పద్ధతులపై అవగాహన కల్పించారు. రైతులకు నాణ్యమైన మొక్కల ఆవశ్యకతను తెలియజేశారు.