ఆదిలాబాద్ జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం ఆదివారం జరిగింది. రాష్ట్ర స్విమ్మింగ్ అసోసియేషన్ కోశాధికారి కిరణ్ కుమార్ ఎన్నికల అబ్జర్వర్‌గా వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో సాయిని రవికుమార్ నూతన అధ్యక్షుడిగా, కొమ్ము కృష్ణ ప్రధాన కార్యదర్శిగా, హరిచరణ్ కోశాధికారిగా, లాలా మున్నా ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి పార్థసారథి, డివైఎస్ఓ శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు.