ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

1చూసినవారు
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగినప్పుడే సమాజం వేగంగా అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ఆదిలాబాద్ గ్రామీణ మండల పరిషత్ కార్యాలయంలో మహిళా వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన మండల సమాఖ్య సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మహిళలు గృహిణులుగా ఉండటమే కాకుండా, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధి రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. 'ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక' ద్వారా అర్హులైన మహిళలకు, స్వయం సహాయక సంఘాలకు రాయితీలు, రుణాలు సకాలంలో అందేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్