ఆదిలాబాద్: స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేసిన బృందం సభ్యులు

83చూసినవారు
ఆదిలాబాద్: స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేసిన బృందం సభ్యులు
లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని డీఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్ పేర్కొన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందులో భాగంగా ప్రత్యేక తనిఖీ బృందం ఆదిలాబాద్ పట్టణంలోని రెండు స్కానింగ్ సెంటర్లను శుక్రవారం తనిఖీ చేశారు. రిజిస్టర్లను పరిశీలించి సూచనలు, సలహాలు ఇచ్చారు. తనిఖీ బృందం సభ్యులు డిప్యూటీ డీఎంహెచ్ఓ సాధన, డాక్టర్ క్రాంతి, యశోద, వైష్ణవి ఉన్నారు.

సంబంధిత పోస్ట్