ఈనెల 7న ఆదిలాబాద్‌లోని సీఐటీయూ కార్యాలయంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా 4వ మహాసభలు నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా కార్యదర్శి లంక రాఘవులు తెలిపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్ రాములు ముఖ్యఅతిథిగా హాజరవుతారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పాత ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని ఆయన కోరారు.