పదో తరగతి పరీక్షలు.. కలెక్టర్ ఆదేశాలు

1చూసినవారు
పదో తరగతి పరీక్షలు.. కలెక్టర్ ఆదేశాలు
ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా శనివారం పదో తరగతి పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఈనెల 14 నుంచి ఏప్రిల్ 15 వరకు జరిగే పరీక్షలకు జిల్లాలో 10,928 మంది విద్యార్థులు హాజరుకానుండగా, 52 కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణకు 52 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 52 మంది డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు, 13 మంది సి-కస్టోడియన్లను నియమించారు. కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు, జిరాక్స్ సెంటర్ల మూసివేత, పరీక్షా పత్రాల రవాణాకు వాహనాల ఏర్పాటు, తాగునీటి సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. పరీక్షల సమయానికి బస్సు వేళలను సర్దుబాటు చేయాలని ఆర్టీసీ అధికారులను కోరారు.