ఆదిలాబాద్ కు చేరుకున్న పాఠ్యపుస్తకాలు

1చూసినవారు
ఆదిలాబాద్ కు చేరుకున్న పాఠ్యపుస్తకాలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేసే పాఠ్యపుస్తకాలు జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి. జిల్లాకు అవసరమైన 4,80,700 పుస్తకాలలో 4,45,170 పుస్తకాలు ఇప్పటికే వచ్చాయని డీఈవో రాజేశ్వర్ తెలిపారు. పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో, విద్యార్థులకు సకాలంలో పుస్తకాలు అందించేందుకు నేటి నుంచే మండలాలకు సరఫరా ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు.

ట్యాగ్స్ :