ఆదిలాబాద్‌లోని ప్రెస్ క్లబ్‌లో బుధవారం మాట్లాడిన మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షుడు రేగుంట సునీల్, రాష్ట్రంలో మాదిగ కార్పొరేషన్, లెదర్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ఛైర్మన్‌తో పాటు సభ్యుల నియామకం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణను రాష్ట్రంలో అమలు చేసినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడిగా బొజ్జ అడెల్లు, అధ్యక్షుడిగా అశోక్‌తో పాటు పలువురిని ఎన్నుకున్నారు.