మహనీయులైన బాబూ జగ్జీవన్ రామ్, డా. బి. ఆర్. అంబేడ్కర్ ల జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. ఆదిలాబాద్ లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో, ఈ నెల 5న బాబూ జగ్జీవన్ రామ్ 119వ జయంతి, 14న డా. బి. ఆర్. అంబేడ్కర్ 135వ జయంతి వేడుకలను జిల్లా వ్యాప్తంగా నిర్వహించాలని సూచించారు. వారి ఆశయాలను, సేవలను భావితరాలకు చాటిచెప్పేలా కార్యక్రమాలను రూపొందించాలని సూచనలిచ్చారు.