దేశ భవిష్యత్తు ప్రణాళికలు, సంక్షేమ పథకాల అమలుకు జనగణన అత్యంత కీలకమని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ‘జనగణన నుండి జన కల్యాణం’ నినాదంతో పకడ్బందీగా ప్రక్రియ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఆదిలాబాద్ టీటీడీసీలో సోమవారంతో ముగిసిన ‘సెన్సస్-2027’ ఫీల్డ్ ట్రైనర్ల మూడు రోజుల శిక్షణ కార్యక్రమం ముగింపు సమావేశంలో ఆయన ట్రైనర్లకు దిశానిర్దేశం చేశారు.