ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఫాక్స్ గార్డెన్ లో నిర్వహించిన జిల్లా స్థాయి కిసాన్ మేళా కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు శ్రీ గోడం నగేష్ గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అనేక రాయితీలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. రైతుల నుంచి సలహాలు స్వీకరించి, అవసరమైన వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సేవ సహకార సంఘం ద్వారా రైతులకు రెండు లక్షల రూపాయల చెక్కును అందజేశారు.