ఆదిలాబాద్ లో వినాయక నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. వివిధ ప్రాంతాల్లో విభిన్న ఆకృతుల్లో గణనాథులను ప్రతిష్టించారు. భుక్తాపూర్ కాలనీలో భవానీ గణేష్ మండల్ వారు ముద్దులొలికే బాల గణనాథుని ప్రతిష్టించారు. అందర్నీ ఆకట్టుకునేలా చక్కగా రెండు చేతులు కట్టుకుని వినయంగా, క్యూట్ గా ఉన్న బాల గణనాథుని చూసేందుకు భక్తులు ముఖ్యంగా చిన్నారులు ఉత్సహాన్ని చూపుతున్నారు.