కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జైబాపు, జై భీం, జై సంవిధాన్ కార్యక్రమాన్ని మంగళవారం మావలలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు. దేశాన్ని రక్షించే ఏకైక ఆయుధం రాజ్యాంగం అని, కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం రిజర్వేషన్లను తీసివేసే కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. డీసీసీబీ చైర్మన్ భోజారెడ్డి, నాయకులు కొండూరు రవి, షకీల్, ప్రవీణ్, శ్రీరామ్ ఉన్నారు.