వికసిత భారత్‌కు పునాది.. జనగణన–2027

1చూసినవారు
వికసిత భారత్‌కు పునాది.. జనగణన–2027
దేశాభివృద్ధికి కీలకమైన జనాభా గణన-2027 ప్రక్రియకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ‘వికసిత భారత్–2047’ లక్ష్య సాధనకు ఖచ్చితమైన గణాంకాలు అవసరమని, ప్రజలందరూ బాధ్యతగా పాల్గొని సమగ్ర సమాచారం అందించాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ లో మాట్లాడుతూ, జనాభా గణన రెండు దశల్లో జరుగుతుందని, మొదటి దశలో ఇండ్ల జాబితా, ఇండ్ల గణన మే 11 నుంచి జూన్ 9 వరకు ఎన్యుమరేటర్లు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తారని చెప్పారు. రెండో దశ గణన 2027 ఫిబ్రవరిలో జరుగుతుంది. ఈసారి సాంకేతికతను ఉపయోగిస్తూ, ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు https: //se. census. gov. in పోర్టల్ ద్వారా ప్రజలు స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకునే ‘సెల్ఫ్ ఎన్యుమరేషన్’ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్