మన్నూర్ గ్రామంలో మహిళా వారోత్సవాలను ప్రారంభించిన కలెక్టర్ రాజర్షిషా, బాల్య వివాహ రహిత ఆదిలాబాద్ జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. మహిళలు, చిన్నారుల భద్రతకు సంబంధించిన టోల్ ఫ్రీ నంబర్ల పోస్టర్లను ఆవిష్కరించారు. బాల్య వివాహ రహిత గ్రామ పంచాయతీలను అభినందించి, ప్రశంసా పత్రాలు అందజేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.