ఆదిలాబాద్ జిల్లాలో మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టడం, బానిసలైన వారిని సాధారణ జీవితంలోకి తీసుకురావడం లక్ష్యంగా జిల్లా పోలీసు శాఖ చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ రిమ్స్ ప్రాంగణంలో ఉన్న డవ్ డి-అడిక్షన్ కేంద్రాన్ని సందర్శించి, అక్కడ అందిస్తున్న చికిత్సా విధానాలు, సౌకర్యాలను పరిశీలించారు. గంజాయి, మద్యం వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారికి వైద్య సలహాలు, కౌన్సెలింగ్ ద్వారా చికిత్స అందించి, ఆరోగ్యవంతమైన జీవన విధానంలోకి తీసుకురావడంపై దృష్టి సారించినట్లు ఎస్పీ తెలిపారు.