ఆదిలాబాద్ జిల్లాలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, అజారుద్దీన్‌ల పర్యటన తూతూమంత్రంగా సాగిందని మాజీ మంత్రి జోగు రామన్న విమర్శించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ, గత
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన మైనార్టీ రెసిడెన్షియల్ భవనాలను ఇప్పుడు ప్రారంభించడం హాస్యాస్పదమన్నారు. మైనార్టీల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరించిందని,
కాంగ్రెస్ నేతలు మైనార్టీలకు తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.