రాష్ట్ర ప్రభుత్వానికి జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని జాగృతి అధ్యక్షురాలు కవిత మంగళవారం ఆదిలాబాద్‌లో విమర్శించారు. రాష్ట్రంలో పత్తి, సోయా, మొక్కజొన్న రైతులు ఎవరూ సంతోషంగా లేరని ఆమె పేర్కొన్నారు. తుపాన్ హెచ్చరికలున్నా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని, 20-25 శాతం తేమ ఉన్నా పత్తి కొనుగోళ్లు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు.