నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ఆదిలాబాద్ తెలంగాణ మైనారిటీ గురుకుల బాలికల పాఠశాలలో నిర్వహించిన భారీ జాబ్ మేళాలో ఆయన మాట్లాడుతూ, స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో ప్రభుత్వం మెగా జాబ్ మేళాలు నిర్వహిస్తోందని తెలిపారు. యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసమే కాకుండా, ప్రైవేటు రంగంలోని అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా స్థిరపడాలని ఆకాంక్షించారు. నియామక పత్రాలు అందుకున్న వారు క్రమశిక్షణతో ఉన్నతంగా స్థిరపడాలని సూచించారు.