మే 20న చేపట్టే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ కార్యదర్శి కిరణ్ కోరారు. బుధవారం ఆదిలాబాద్ సీఐటీయూ కార్యాలయంలో కేంద్ర కార్మిక సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. నాలుగు లేబర్ కోడ్ లను కేంద్రం వెంటనే వెనికి తీసుకోవాలన్నారు. సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయడానికి కోసం ఈనెల 22న స్థానిక బజరంగ్ ఫంక్షన్ హాల్ లో సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నాయకులు వెంకటనారాయణ, దేవేందర్ ఉన్నారు.