జనవరి 5న గుండెపోటుతో మృతి చెందిన కానిస్టేబుల్ రాథోడ్ విలాస్ కుటుంబానికి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ రూ. 8 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సహాయం భద్రతా పథకం ద్వారా మంజూరైంది. మృతి చెందిన కానిస్టేబుల్‌కు భార్య జ్యోతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాధిత కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎస్పీ తెలిపారు.