కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో సేవాదళ్‌కు ఎంతో విశిష్టమైన స్థానం ఉందని జిల్లా
కాంగ్రెస్ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్ అన్నారు. డీసీసీ కార్యాలయంలో జిల్లా
కాంగ్రెస్ సేవాదళ్ విభాగం ఆధ్వర్యంలో నాలుగో ఆదివారం నిర్వహించే జెండా వందనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాకు వందనం సమర్పించారు. ఏ. ఏం. సి చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, సేవాదళ్ అద్యక్షుడు మోతీరామ్, టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, డీసీసీబీ మాజీ చైర్మన్ బోజరెడ్డి, తదితరులు ఉన్నారు.