ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నాణ్యమైన విద్యతో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు అధ్యాపకుల పాత్ర కీలకమని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఆదిలాబాద్ ఇంటర్మీడియేట్ కార్యాలయంలో మ్యాథ్స్ లెక్చరర్ల ప్రత్యేక ఓరియంటేషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీసి, వారిని ఉన్నత శిఖరాలకు చేర్చాల్సిన బాధ్యత అధ్యాపకులపైనే ఉందని తెలిపారు.