మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఎన్నికలకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని వేగంగా, పారదర్శకంగా మీడియాకు అందించేందుకు కలెక్టరేట్‌లో మీడియా సెంటర్‌ను ఏర్పాటు చేశారు. బుధవారం డీపీఆర్‌ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ మీడియా సెంటర్‌ను కలెక్టర్ అధికారికంగా ప్రారంభించారు. ఎన్నికల ప్రక్రియ మొత్తం నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిగేలా మీడియా సెంటర్ కీలక భూమిక పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు.