ఆదివాసీ వీరుడు రాంజీ గోండ్ వర్ధంతి సందర్భంగా ఆదిలాబాద్‌లో ఆయన విగ్రహానికి మాజీ ఎంపీ సోయం బాపూరావు పూలమాల వేసి నివాళులర్పించారు. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన రాంజీ గోండ్ వంటి యోధుల జీవిత చరిత్రలను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివాసీల త్యాగాలను భావితరాలకు తెలియజేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, వారి స్మారకాలను అభివృద్ధి చేయాలని ఆయన కోరారు.