సవాలుగా మారిన మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల ఎంపిక!

3చూసినవారు
సవాలుగా మారిన మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల ఎంపిక!
ఆదిలాబాద్ జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి. అయితే, చైర్మన్ అభ్యర్థుల ఎంపిక ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అభ్యర్థులను ముందుగానే ప్రకటిస్తే అంతర్గత విభేదాలు తలెత్తి ఓటమి ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీలో ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో గ్రూపు రాజకీయాలు ఫలితాలపై ప్రభావం చూపుతాయనే భయం వెంటాడుతోంది. పరోక్ష ఎన్నికల నేపథ్యంలో, అధిష్టానాలు ప్రస్తుతానికి పేర్లను గోప్యంగా ఉంచి, ఎన్నికల తర్వాత గెలిచిన కౌన్సిలర్ల బలాబలాలను బట్టి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్