ఆదిలాబాద్ జెడ్పీ సమావేశ మందిరంలో 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక'లో భాగంగా నిర్వహించిన మహిళా వారోత్సవాలు కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మహిళలు, చిన్నారుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని, మాతాశిశు ఆరోగ్య రక్షణ, గర్భిణీలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించడంలో అంగన్‌వాడీ కేంద్రాల పాత్ర కీలకమని తెలిపారు.