ఆదిలాబాద్: స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న సేవలు మరువలేనివి

69చూసినవారు
ఆదిలాబాద్: స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న సేవలు మరువలేనివి
స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతి వేడుకలను శనివారం ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా బీసీ సంక్షేమ అధికారి రాజలింగు మాట్లాడుతూ.. స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న అని పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు, తదితరులు ఉన్నారు.