ఆదిలాబాద్ జిల్లాకు యాసంగి సీజన్‌కు 6,542 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని, ఇప్పటివరకు 4,045 మెట్రిక్ టన్నులు రైతులు కొనుగోలు చేశారని కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులకు సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. యూరియా పంపిణీలో ఏవైనా సమస్యలు ఉంటే 8977742855 నంబర్‌కు సంప్రదించవచ్చని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని కోరారు.