ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అసెంబ్లీలో మాట్లాడుతూ, చదువుకున్న, ఉద్యోగాలు చేస్తున్న కొందరు తల్లిదండ్రుల పట్ల వ్యవహరిస్తున్న తీరు చూస్తే మనుషులా రాక్షసులా అనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధ తల్లిదండ్రులను పట్టించుకోని ప్రభుత్వ ఉద్యోగుల జీతంలో రూ. 10వేల కోత విధించే బిల్లును తీసుకువచ్చినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తల్లిదండ్రులను హింసిస్తున్న వారి జీతంలో 15% కోత విధించాలని ఆయన కోరారు.