ఆదిలాబాద్ జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో పెద్ద పులుల సంచారం ప్రజల్లో తీవ్ర భయాందోళనలు రేపుతోంది. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్, తాడోబా అటవీ ప్రాంతాల నుంచి మేటింగ్ కోసం పెన్‌గంగా నది దాటి జిల్లాలోకి వస్తున్న నాలుగు పులులు భీంపూర్, బోథ్, సొనాల మండలాల్లో సంచరిస్తున్నాయి. దీంతో అటవీ ప్రాంత ప్రజలు, రైతులు, కూలీలు భయంతో పొలాలకు వెళ్లడానికి జంకుతున్నారు. బోథ్ మండలంలోని రెండ్లపల్లిలో చిరుత దాడిలో రెండు ఆవులు మృతి చెందాయి. అటవీ శాఖ అధికారులు బేస్ క్యాంపులు ఏర్పాటు చేసి, పులుల కదలికలపై నిఘా ఉంచి, ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.