బక్రీద్ పండుగ సందర్భంగా ఆదిలాబాద్ లోని ఈద్గా మైదానం వద్ద జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ బందోబస్తు ప్రక్రియను పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా, ముఖ్యమైన ప్రదేశాలలో, మసీదుల వద్ద పికెట్స్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రజలందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, జిల్లా వ్యాప్తంగా ముస్లిం సోదరుల ప్రార్థనలు ప్రశాంతంగా పూర్తయ్యాయని, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.