ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నేడు నామినేషన్లకు ఆఖరు

471చూసినవారు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నేడు నామినేషన్లకు ఆఖరు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వేడి రాజుకుంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా, తొలి రోజు నామమాత్రంగానే దాఖలయ్యాయి. కేవలం మూడు రోజులు మాత్రమే సమయం ఉండటంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. గురువారం రెండో రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. వివిధ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నామినేషన్లు వేశారు. ఒక్కో వార్డు నుంచి నలుగురికి పైగా నామినేషన్లు వేయడంతో పోటీ తీవ్రంగా మారుతోంది.

సంబంధిత పోస్ట్