నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా పరిధిలోని టోల్ ప్లాజాలలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆదిలాబాద్ సీఐటీయూ జిల్లా కార్యదర్శి కిరణ్ కోరారు. ఈ విషయమై శనివారం కామారెడ్డిలోని ఎన్హెచ్ఎఐ ప్రైమరీ ఇంప్లిమెంటేషన్ యూనిట్‌లో పీడీ శ్రీనివాసరావుకు సీఐటీయూ ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం చెల్లించాలని కోరారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆశన్న ఉన్నారు.