ఆదిలాబాద్ రిమ్స్‌లోని స్పెషల్ న్యూబార్న్ కేర్ యూనిట్లో సోమవారం అర్ధరాత్రి సుమారు 11: 30 గంటలకు ఏసీకి సంబంధించిన సమస్యతో మంటలు చెలరేగి దట్టమైన పొగ వ్యాపించింది. ఈ ఘటనలో చికిత్స పొందుతున్న ముగ్గురు పసికందులు మృతి చెందారు. పుట్టిన కొద్దిరోజులకే మూడు పసి ప్రాణాలు అగ్నికి బలికావడంతో బాధిత కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఆస్పత్రుల్లో భద్రతా ప్రమాణాలు, విద్యుత్ పరికరాల నిర్వహణపై అధికారుల పర్యవేక్షణ ఎంతమేర ఉందనే ప్రశ్నలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.