ఆదిలాబాద్ జిల్లా తాంసిలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గిరిగామకు చెందిన ఆదే జ్ఞానేశ్వర్ కుమార్తె వివాహం మే 4న నిశ్చయమైంది. ఆదివారం పత్రికలు పంచడానికి బంధువుల ఇంటికి వెళుతుండగా, మహారాష్ట్రలోని బోరిగామ సమీపంలో ఎదురుగా వచ్చిన బైక్ ఢీకొనడంతో జ్ఞానేశ్వర్ తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రికి తరలించేలోపే ఆయన మృతి చెందారు. ఆయనతో పాటు ఉన్న అమృత్ కూడా గాయపడటంతో, అతన్ని రిమ్స్‌కు, అక్కడి నుంచి NZBకి తరలించారు.