
మరో వివాదంలో ఉదయనిధి స్టాలిన్ (వీడియో)
తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల ఓ ఆలయాన్ని ఆయన సందర్శించారు. ప్రచారంలో భాగంగా ఆలయానికి వెళ్లిన ఆయన.. ఆ సమయంలో బొట్టు పెట్టుకుని అర్చకుల ఆశీర్వాదం తీసుకున్నారు. గతంలో సనాతన ధర్మంపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి స్టాలిన్, ఇప్పుడు ఆలయ దర్శనం చేసుకోవడంతో వివాదం చెలరేగింది. అయితే, ఆలయం నుంచి బయటికి వచ్చిన వెంటనే ఆ బొట్టును తుడిచివేశారని ఆరోపణలు వస్తున్నాయి.




