భీమా కోరేగావ్ అమరవీరులకు నివాళి

0చూసినవారు
భీమా కోరేగావ్ అమరవీరులకు నివాళి
గురువారం నార్నూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ లో ఉన్న అంబేద్కర్ చౌక్ వద్ద భీమా కోరేగావ్ యుద్ధంలో అమరులైన 500 మంది దళితుల త్యాగాన్ని గుర్తుచేసుకున్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బహుజనుల పెద్దలు మాట్లాడుతూ, ప్రతిఒక్కరూ ధైర్యసాహసాలతో ఉండాలని, సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బహుజనులందరు, మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్