గుడిహత్నూర్ లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై. ఎస్. రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా మండల
కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ అందించిన సంక్షేమ పథకాలు, రైతులు–పేదల కోసం చేసిన సేవలను నాయకులు స్మరించుకున్నారు. ప్రజల హృదయాల్లో వైఎస్సార్ చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వంభర్, రాంకిషన్, జైరామ్, ఆడే జైపాల్, వాసీం ఖాన్ తదితరులు ఉన్నారు.