ఈ నెల 4న ఆదిలాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీస్ సిబ్బందితో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి పర్యటనకు మూడంచెల భద్రతను ఏర్పాటు చేసినట్లు, 700 మంది పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రశాంత వాతావరణంలో సమావేశం పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. బందోబస్తును 9 సెక్టార్లుగా విభజించి, ప్రతి ఒక్కరూ తమ విధులను సక్రమంగా నిర్వహిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.