ఆదిలాబాద్ జిల్లాలోని కే ఆర్కే కాలనీ ప్రభుత్వ పాఠశాలలో బుధవారం మధ్యాహ్నం 7వ వార్డు కౌన్సిలర్ దుమ్మని రాము మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన నాణ్యత, పరిశుభ్రత, వంటగదుల పరిశుభ్రత, నిల్వ విధానాలను పరిశీలించి, సిబ్బందికి సూచనలు చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని, ఎలాంటి లోపాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.