ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్లో నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో ఉట్నూర్లోని వికాసం ప్రత్యేక బాలల పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ పోటీల్లో వారు 15 స్వర్ణ పతకాలు, 13 కాంస్య పతకాలు సాధించి రాష్ట్రస్థాయి క్రీడలకు అర్హత సాధించారు. పాఠశాల పీడీ జలపతి, ఆర్చరీ ఉపాధ్యాయుడు అశోక్ విద్యార్థులను అభినందించారు.